Ugadi Festival
తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యే పర్వ దినం ఉగాది . అంటే అది సంవత్సరాది ...
కొత్త సంవత్సరం లో మొదటి రోజు . ఇలా సంవత్సరాన్ని విడివిడిగా విభాగాలుగా నిర్దేశించే వ్యవస్థనే ఇంగ్లీష్ లో కాలందర్ అంటారు . ఈ కాలందర్ పుట్టుకే సంవత్సరాల పుట్టుకకి పునాది . ఈ కాలందర్ ఆవిర్భావమే ప్రప్రంచంలో వివిధ జాతులు జరుపుకునే సంవత్సరాది కి నాంది ! అసలీ కాలందర్ ఎలా పుట్టిందంటే ఆదిమ మానవుడికి ఒకటే చింత !. ఇప్పటిలా ధనార్జన, విద్యార్జన కోసం పాకులాడడం అతనికి లెవు. ఎ రోజు ఆకలి ఆ రోజు తీర్చుకోవడం.. అది ఎలా అన్నదే అతని సమస్య ! ఈ సమస్య వల్ల ప్రకృతి ని అద్యయనం చేయవలసిన అవసరం ఏర్పడింది అతనికి. అల ప్రకృతిని అద్యయనం చేస్తున్నప్పుడే అతడో విషయం కనిపెట్టాడు . ఇలా కనిపెట్టిందే ఋతు చక్రం . ఋతువులు ఎప్పుడు ఒక దాని తర్వాత వస్తున్తాయని కనిపెట్టాడు . అదీ నియమిత కాలం లో మరల మరలా వస్తున్తాయని తెలుసుకున్నాడు . వసంత ఋతువు , గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు ఇలా ఋతువులని విభజించుకున్న తర్వాత ఎ ఋతువులో తమకు ఆహరం దొరుకుతుందో ఎ ఋతువులో దొరకదో అతనికి తెలిసిపోయింది . ఇదే క్రమం లో తమకు ఇష్టమైన ఆహరం ఎ ఋతువులో లభాయమవుతుందో కూడా అతడు గ్రహించాడు . ఇదే కాలందర్ నాంది! ఇలా పుట్టిన కాలన్దర్ లో రకాలు ఉన్నాయి . సూర్యుడి గతులపై ఆధారపడి రుపొందిన్చుకున్నది సౌరమానం. చంద్రుడి గతుల పై ఆధారపడి రుపొందిన్చుకున్నది చంద్రమానం ! ఆంగ్లేయులు అనుసరిస్తున్నది సుర్యమానమైతే మన ఆంధ్రులు , భారతీయులు అనుసరిస్తున్నది చంద్రమానం !
అందరికి ఉగాది శుభాకాంక్షలు .
No comments:
Post a Comment